ఒకేసారి మూడు నెలల రేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు నెలల రేషన్‌

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

ఒకేసారి మూడు నెలల రేషన్‌ వేసవి నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం

జిల్లాలో 1,38,234మంది తెల్లరేషన్‌కార్డులు

భూపాలపల్లి: భానుడి భగభగలు మొదలయ్యాయి. మార్చి నెలలోనే ఎండలు మండిపోతుండటంతో రానున్న మూడు నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్‌ బియ్యం కోసం రేషన్‌ షాపుల వద్ద పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు జిల్లా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏర్పాట్లు చేస్తున్న

పౌరసరఫరాల అధికారులు

సాధారణంగా ప్రతీ నెల కేటాయించే కోటాను కాకుండా రాబోయే మూడు నెలల బియ్యాన్ని ఏప్రిల్‌ నెలలోనే లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్‌ రాహుల్‌ శర్మ ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల్లో 277 రేషన్‌షాపులు ఉండగా 1,38,234 మంది రేషన్‌కార్డుదారులు, 3,91,353 మంది లబ్ధిదారులు(యూనిట్లు) ఉన్నారు. సర్కారు తీసుకున్న నిర్ణయంతో వీరందరికీ మూడు నెలల రేషన్‌ బియ్యం అందనుంది. పౌరసరఫరాల అధికారులు ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో అంత్యోదయ, అన్నపూర్ణతో పాటు తెల్లరేషన్‌కార్డుల కుటుంబాల్లో సభ్యులందరికీ మూడు నెలలకు సరిపడా బియ్నాన్ని అందించేందుకు గోడౌన్లను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న బియ్యం నిల్వలు, కావాల్సిన బియ్యం వివరాలను ఉన్నతాధికారులకు నివేదించి సకాలంలో బియ్యం దిగుమతి జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాక ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం అందించనుండటంతో రేషన్‌ డీలర్ల వద్ద క్యూ కట్టడం.. తదితర ఇబ్బందులు తలెత్తే దృష్ట్యా, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ప్రణాళికలు రూపొం దిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement