ఓరుగల్లుకు షాక్‌! | - | Sakshi
Sakshi News home page

ఓరుగల్లుకు షాక్‌!

Mar 21 2026 5:10 AM | Updated on Mar 21 2026 5:10 AM

ఓరుగల్లుకు షాక్‌! రాష్ట్ర బడ్జెట్‌ 2026–2027

న్యూస్‌రీల్‌

ఉమ్మడి జిల్లాకు కేటాయింపులు ఇలా..

అవీ, ఇవీ, అన్నీ..

శనివారం శ్రీ 21 శ్రీ మార్చి శ్రీ 2026
రాష్ట్ర బడ్జెట్‌
2026–2027

బడ్జెట్‌లో అంచనాల మేరకు దక్కని ప్రాధాన్యం

ఓరుగల్లుకు కీలకంగా 10 ప్రాజెక్టులు...

జరగని ప్రత్యేక కేటాయింపులు..

కొత్తగా ప్రాజెక్టులను ప్రకటించలేదు. అయితే బడ్జెట్‌ (ప్రగతి పద్దు)లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు, విద్యాసంస్థలకు నిధులు కేటాయించారు. ప్రధానంగా వరంగల్‌ నగరాభివృద్ధి, ఉన్నతవిద్య, పర్యాటక రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపించింది. అయితే, కీలకమైన 10 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించినా.. ప్రత్యేకంగా కేటాయించే నిధులను ప్రస్తావించలేదు. రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, టెక్స్‌టైల్‌ పార్కు, మామునూరు ఎయిర్‌పోర్ట్‌, ఐటీ టవర్‌, రింగ్‌రోడ్డు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, జాతీయస్థాయి యూనివర్సిటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు, టూరిజం సర్క్యూట్‌కు ప్రత్యేక కేటాయింపులు లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా వరంగల్‌ స్మార్ట్‌సిటీకి గత బడ్జెట్‌లో రూ.156.52 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీడబ్ల్యూఎంసీ) సహాయం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. పథకం కింద వరంగల్‌ స్మార్ట్‌సిటీ అభివృద్ధి పనుల కోసం రూ.44,137.02 లక్షలు కేటాయించారు.

కొత్త ప్రాజెక్టులు జీరో.. పాత పనుల కొనసాగింపు

కేటాయింపుల్లో ఉమ్మడి జిల్లాకు ‘ప్రత్యేకం’ లేదు

యూజీడీ, మామునూరు సహా కీలక ప్రాజెక్టులకు పద్దులు లేవు

అభివృద్ధి, సంక్షేమ పథకాలు యథాతథం..

ఆరు గ్యారంటీలకు ఆదరణ

సాగునీరు, వ్యవసాయరంగాలు, మహిళా సంక్షేమానికి పెద్దపీట

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మరోసారి నిరాశే ఎదురైంది. శాసనసభలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ప్రగతిపద్దుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాఖల వారీగా నిధులు కేటాయించినప్పటికీ వరంగల్‌ పేరుతో ప్రత్యేకంగా ప్రకటించిన పథకాలు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే కొనసాగుతున్న ప్రాజెక్టులకు మాత్రమే పరిమితమైన ఈ బడ్జెట్‌పై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పెద్దగా ప్రచారం చేసిన టెక్స్‌టైల్‌ పార్కు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలకు కేవలం కొనసాగింపు నిధులే కేటాయించగా.. కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలు పూర్తిగా కనిపించలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ బడ్జెట్‌లో కొత్తగా మెగా ప్రాజెక్టు ఒక్కటి కూడా ప్రకటించకపోవడం.. ప్రత్యక్ష కేటాయింపుల్లో ప్రాధాన్యం దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం యూనిట్‌గా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళా, రైతు, కార్మికవర్గాలకు ప్రయోజనం కలగనుంది. కాగా, ఈ బడ్జెట్‌లో వివిధ రంగాలకు జరిగిన కేటాయింపుల ద్వారా ఉమ్మడి వరంగల్‌కు రూ.6 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు పరోక్షంగా లాభం చేకూరనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

● వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించడం ద్వారా ఉమ్మడి జిల్లాలో 15,01,109 ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్న 6,33,229 మంది రైతులకు అర్హతను బట్టి రైతుభరోసా, రైతుబీమా సౌకర్యం కలగనుంది. రైతుభరోసా ద్వారా సుమారు 6.50 లక్షల మంది రైతులకు రూ.900 కోట్ల నుంచి రూ.1,100 కోట్ల వరకు సంవత్సరానికి లబ్ధి చేకూరనుంది.

● ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈబడ్జెట్‌లో రూ.26,674 కోట్లు కేటాయించింది. మొత్తం 3,331 ప్రభుత్వ పాఠశాలల్లో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించడం ద్వారా విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.

● ఉచిత ప్రయాణ పథకం కొనసాగింపు వల్ల ఆర్టీసీ బస్సుల్లో వరంగల్‌ రీజియన్‌లో రోజుకు సగటున సుమారు 55 వేల మంది మహిళలు రాకపోకలు సాగించనున్నారు.

● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన సుమారు 8 వేల మంది లబ్ధిదారులకు బిల్లులు అందనున్నాయి.

● గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల లోపు కరెంట్‌ వాడుతున్న 6,12,901 మందికి ఉచిత విద్యుత్‌ సౌకర్యం నిరంతరం కొనసాగనుంది.

గోదావరి ఎత్తిపోతల పథకం (జీఎల్‌ఐఎస్‌) ప్రాజెక్టు

ఎస్టాబ్లిష్‌మెంట్‌కు రూ.5 కోట్లు

జేసీఆర్‌ దేవాదుల ఎత్తిపోతల పథకం (సీఈ) పేరిట రూ.445 కోట్లు

రామప్ప, పాకాల, లక్నవరం, మల్లూరుకు రూ.కోటి చొప్పన రూ.4 కోట్లు

మామునూరు వెటర్నరీ సైన్స్‌ కళాశాలకు రూ.25 కోట్లు

వరంగల్‌లోని రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌కు రూ.30 లక్షలు

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో కొత్త భవనాల నిర్మాణానికి రూ.10 కోట్లు

మేడారం జాతర పనుల కోసం రూ.10 కోట్లు

ములుగులోని ఫారెస్ట్‌ కాలేజీ, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ)

రూ. 93.22 కోట్లు

కాకతీయ విశ్వవిద్యాలయానికి రూ.40 కోట్లు

కాళోజీ నారాయణరావు ఆరోగ్యవిజ్ఞాన విశ్వవిద్యాలయానికి

రూ. 60 లక్షలు

వరంగల్‌, కరీంనగర్‌ క్రీడా పాఠశాలల సాయం కోసం రూ.42.80 కోట్లు

జనగామలో ప్రభుత్వ కోకోన్‌ మార్కెట్‌ నిర్మాణానికి రూ.2.53 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement