ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం

Mar 21 2026 5:10 AM | Updated on Mar 21 2026 5:10 AM

మల్హర్‌: మండలంలోని తాడిచర్లలో ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ట్రేడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అయిత ప్రకాశ్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలకు జీవనోపాధి పెంపొందించడానికి నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో మంత్రి శ్రీధర్‌బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూట్టారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ బండి స్వామి, కొయ్యూరు సర్పంచ్‌ కొండ రాజమ్మ, రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్‌ సభ్యుడు దండు రమేష్‌, తాడిచర్ల ఉప సర్పంచ్‌ బబ్బిలి రాజు, డీపీఎం గోవింద్‌ చవాన్‌, ఏపీఎం హనుమంతరావు, సీసీలు, వీఓలు పాల్గొన్నారు.

మహిళలకు ఆర్థిక చేయూత

కాళేశ్వరం: కుట్టు మిషన్‌ల ద్వారా మహిళలకు ఆర్థికంగా చేయూతను అందిస్తున్నట్లు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజబాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్‌ మండలం పలుగుల గ్రామంలో కుట్టు మిషన్‌ కేంద్రాన్ని సర్పంచ్‌ గారె విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రనాథ్‌, ఏపీఓ రాజన్న, ఐకేపీ సిబ్బంది శశి, ఉప సర్పంచ్‌ చంద్రయ్య, దేవస్థానం మాజీ డైరెక్టర్‌ మెంగాని అశోక్‌, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement