కాళేశ్వరం: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో వేదపండితులు భక్తులకు ‘పంచాంగ పఠనం’ చేశారు. గురువారం సాయంత్రం ఆలయ ఉపప్రధాన అర్చకుడు పనకంటి పణీంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు బైకుంఠపాండాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాశులవారీగా ఆదాయ, వ్యయాలు, రాజపూజ్యం, అవమానాలను వివరించారు. అనంతరం ఉగాది పచ్చడి, ప్రసాదాన్ని భక్తులకు వితరణ చేశారు. స్వామివారి గర్భగుడిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెన్నపురెడ్డి మోహన్‌రెడ్డి, ఉప సర్పంచ్ చెమ్మాల సుధీర్, మాజీ సర్పంచ్‌లు వసంత, రాంరెడ్డి, మాజీ డైరెక్టర్‌లు సమ్మయ్య, శ్యాందేవుడా, కె.శ్రీనివాస్‌రెడ్డి, ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, గందెసిరి సంతోష్, రామన్న, రమేష్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


