భూపాలపల్లి రూరల్: ఉగాది పండుగ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. గురువారం మంజూర్‌నగర్‌లో ఇల్లందు క్లబ్ హౌజ్‌లో శ్రీ వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉగాది పురస్కారాలు–2026 సంజీవనం పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలాంటి ఉత్సవాలు సమాజంలో ఐక్యతను, సంప్రదాయ విలువలను పెంపొందిస్తాయన్నారు. ‘సంజీవనం’ వంటి పుస్తకాలు మన సంస్కృతి, జీవన విధానాలను భవిష్యత్ తరాలకు అందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్యగౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, కౌన్సిలర్లు, ఉగాది ఉత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు, కళాకారులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు


