● ఆన్‌లైన్ గేమ్స్‌తో
కష్టాలు
● పలు కేసుల్లో
మైనర్లు అరెస్ట్
● అప్పులతో
పెరుగుతున్న
ఆత్మహత్యలు
మొబైల్ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంట్లో ప్రతీఒక్కరికి మొబైల్ సాధారణమైంది. కొందరు మొబైల్‌ను మంచి కోసం ఉపయోగిస్తుంటే మరికొందరు మొబైల్ ఫోన్‌లో ఆన్‌లైన్ గేమ్స్‌కు, చెడు వ్యసనాలకు అలవాటు పడి అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువగా వాహనాలను నడిపేవారు మొబైల్‌లో మాట్లాడుతూ నడపడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యువత లక్ష్యాన్ని ఎంచుకుని అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తేనే సమాజంలో తమకంటూ గుర్తింపు వచ్చి తమ జీవితాలను అందంగా మార్చుకునే వీలుందని అభిప్రాయపడుతున్నారు.


