రంజాన్‌ మాసం క్రమశిక్షణకు ప్రతీక | - | Sakshi
Sakshi News home page

రంజాన్‌ మాసం క్రమశిక్షణకు ప్రతీక

Mar 20 2026 8:00 AM | Updated on Mar 20 2026 8:00 AM

భూపాలపల్లి: రంజాన్‌ మాసం క్రమశిక్షణ, త్యాగం, దాతృత్వానికి ప్రతీక అని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం సాయంత్రం పోలీసు అధికారులు, సిబ్బందికి ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరయ్యారు. ఇఫ్తార్‌ విందు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థలో మతసామరస్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పండుగలను సమష్టిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రంజాన్‌ మాసం శాంతి, సహనం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో ఐక్యతను మరింత బలపరిచే పండుగగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌, డీఎస్పీలు సంపత్‌రావు, సూర్యనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్‌, సీఐలు, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement