● కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి: జిల్లా ప్రజలకు కలెక్టర్ రాహుల్ శర్మ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పండుగ ప్రతీ కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టే శుభదినమన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రజలందరు భాగస్వాములు కావాలని కోరారు. ఈ పండుగ ప్రతిఒక్కరికి సు ఖసంతోషాలను తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి దేవస్థానం పరిధిలోని పురాతన విగ్రహాల పరిరక్షణకు పు రావస్తు శాఖ, దేవాదాయశాఖ సంయుక్తంగా శ్రీకారం చుట్టారు. బుధవారం ఈఓ మహేష్‌తో కలిసి పు రావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మా ధవి, డిప్యూటీ సూపరింటెండెంట్ కోటయ్యలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ముందుగా కాళేశ్వరంలోని పురాతనమైన నృసింహస్వామి, సోమేశ్వరాలయం, చంద్రశేఖరాలయాలు, కాళేశ్వరాలయం ఆవరణలోని పురాతన విగ్రహాలను, వివిధ ప్రాంతాల్లో నిరాధరణకు గురైన చారిత్రక విగ్రహాలను అధికారులు పరిశీలించారు. నిబంధనల మేరకు విగ్రహాలను రసాయన పదార్థాలతో శుభ్రం చేసి మెరుగులు దిద్దడం, భక్తులు, పర్యాటకుల సందర్శనార్థం దేవాలయ ఆవరణలోనే ప్రత్యేకంగా భద్రపరస్తామని అధికారులు తెలిపారు. రూ.120 కోట్ల వ్యయంతో మ్యూజియం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.


