మొగుళ్లపల్లి: ఉద్యాన పంటల సాగుతో అధిక లా భాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని ఇస్సిపేట గ్రామంలో ఉద్యాన పంటల సాగుపై అవగాహన, శిక్షణ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యాన పంటల ప్రాముఖ్యత, తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి సురేందర్‌రెడ్డి, జైన్ ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధి శ్యాంసుందర్, సర్పంచ్ యార ముకుందం, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వాసు, ప్రీతం, అజయ్, రమేష్, జైన్, ఫినోలెక్స్ కంపెనీ ప్రతినిధులు శ్యామ్ కు మార్, రజనీకాంత్, రైతులు పాల్గొన్నారు.
జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్


