రేగొండ: రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి సునీల్ కుమార్ అన్నారు. మంగళవారం కొత్తపల్లిగోరి మండలంలోని గాంధీనగర్ గ్రామంలో రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యాన పంటల సాగు ద్వారా మార్కెట్‌లో మంచి రేటు లభించి రైతుల ఆదాయం పెరుగుతుందని అన్నారు. డ్రిప్ సాగు విధానాన్ని అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన విస్తరణ అధికారి సురేష్ పాల్గొన్నారు.


