భూపాలపల్లి అర్బన్: సింగరేణిలో పాత విధానంలోనే మెడికల్ బోర్డు నిర్వహించాలని, రాజకీయ జోక్యాన్ని నిర్మూలించాలని ఏఐటీయూసీ బ్రాంచీ సెక్రటరీ మోటపలుకుల రమేశ్ డిమాండ్ చేశారు. సేవ్ సింగరేణి బస్ యాత్రలో భాగంగా మంగళవారం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఈ నెల 30న కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గనుల కార్మికులు, యూనియన్ నాయకులు శ్రీనివాస్, ఆసిఫ్‌పాషా, శంకర్ పాల్గొన్నారు.


