బుధవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2026
గతంలో కొత్తలైన్‌లకు జౌట్ రైట్ కంట్రిబ్యూటర్ చార్జీలు వసూలు చేసేది. దీంతో కొత్తలైన్‌లు, కనెక్షన్‌లు ఏర్పాటు చేసుకోవడానికి చార్జీలు చెల్లించలేని వినియోగదారులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యూలేషన్ కమిషన్ సులభతరంగా పారదర్శకంగా ఒక కిలోమీటర్ వరకు ఉచితంగా సర్వీస్ లైన్‌లు అందే విధంగా ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి.
హన్మకొండ: నూతన విద్యుత్ సర్వీస్‌ల మంజూరును విద్యుత్ పంపిణీ సంస్థలు సులభతరం చేశాయి. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి రెగ్యులేషన్ నంబర్ 1 ఆఫ్ 2026 జారీ చేసింది. దీని ప్రకారం విద్యుత్ వినియోగదారులకు మరింత సులభతరంగా, పారదర్శకంగా సర్వీస్ పొందే అవకాశం కలిగింది. కొత్త ఎల్‌టీ కనెక్షన్లు, అదనపు లోడ్ కోసం సర్వీస్ లైన్‌చార్జీలను సరళంగా, ఏకరీతిగా నిర్ణయించారు. ఒక కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలూ వర్తించవు. కిలోమీటర్ దూరం తర్వాత పొందే విద్యుత్ సర్వీస్‌కు మాత్రమే సర్వీస్ లైన్, ఇతర చార్జీలు చెల్లించాలి. లోడ్ ఆధారంగా మాత్రమే చార్జీలు విధిస్తారు. క్షేత్రస్థాయిలో స్థల పరిశీలన అవసరం లేకుండా త్వరితగతిన కొత్త సర్వీసులు మంజూరు చేస్తారు. ఈ విధానం టీజీఎన్పీడీసీఎల్ పరిధిలో అమలు చేస్తున్నారు. ఈ నూతన విధానం ద్వారా వినియోగదారులు విద్యుత్ కనెక్షన్‌ను వేగంగా పొందుతారు. చార్జీల చెల్లింపులో స్పష్టత ఉంటుంది. 20 కిలోవాట్ వరకు డెవలప్‌మెంట్ చార్జీలు, సర్వీస్ లైన్ చార్జీలు వర్తింపు. 20 కిలోవాట్ పై వాటికి కేవలం సర్వీస్ లైన్‌చార్జీలు మాత్రమే వర్తిస్తాయి. డెవలప్‌మెంట్ చార్జీలు ఉండవు.
– మల్చూర్ నాయక్,
ఎస్‌ఈ, జయశంకర్ భూపాలపల్లి
నూతన విద్యుత్ సర్వీస్‌ల మంజూరు నిబంధనలు మరింత సులభతరం
కిలోమీటర్ దూరం వరకు ఎలాంటి చార్జీలు లేవు.. సర్వీస్ లైన్ చార్జీలను సరళం చేసిన విద్యుత్‌పంపిణీ సంస్థలు
అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మల్టీ స్టోర్ భవనాలకు మొత్తం కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు విధిస్తారు. ట్రాన్స్‌ఫార్మర్ ఖర్చు భారం వినియోగదారునిపై పడదు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు బాధ్యత విద్యుత్ సంస్థదే. నూతన ఏకరీతి విధానం రైతులకు ఎంతో ఉంటుంది. అధిక ఖర్చుల భారం పడదు. ఒక కిలో వాట్‌కు కేవలం రూ.1000 మాత్రమే చెల్లించాలి.
కాంట్రాక్టెడ్ లోడ్ ఆధారంగా చార్జీలు


