కాళేశ్వరంలో అర్చకుడి నియామకం | - | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంలో అర్చకుడి నియామకం

Mar 18 2026 11:14 AM | Updated on Mar 18 2026 11:14 AM

ట్రేడ్‌ లైసెన్స్‌ పన్ను చెల్లించాలి

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం అర్చకుడిగా కొడమంచిలి ఫణికుమార్‌శర్మను నియమించారు. మంగళవారం దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు పలు అభియోగాల నేపథ్యంలో కశ్యప్‌శర్మ నియామకాన్ని నిలిపివేశారు. ఆయన స్థానంలో కొడమంచిలి ఫణికుమార్‌ శర్మను నియమించినట్లు ఆలయ ఈఓ మహేష్‌ తెలిపారు.

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

మల్హర్‌(మహాముత్తారం): మహాముత్తారం పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం కాటారం డీఎస్పీ సూర్యనారాయణ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ రికార్డులను, సిబ్బంది పనితీరును పరిశీలించి స్టేషన్‌ పరిసర ప్రాంతాలను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని, అప్రమత్తంగా విధులు నిర్వహించాలని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాముత్తారం ఎస్సై మహేందర్‌కుమార్‌, ఎస్సై– 2 మహేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ఇళ్ల నిర్మాణాలు

పూర్తిచేయాలి

పలిమెల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వేగం పెంచి మొదటి విడత గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని జిల్లా హౌసింగ్‌ పీడీ లోకిలాల్‌ లబ్ధిదారులకు సూచించారు. మంగళవారం మండలంలోని పలిమెల గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్‌ హౌస్‌, పైలట్‌ ప్రాజెక్టు విలేజ్‌ పంకెన గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల పనుల పురోగతిని అధికారులతో కలిసి అయన పరిశీలించారు. ఈ సందర్భంగా లోకిలాల్‌ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పాగె వైకుంఠం, హౌసింగ్‌ డీఈ శ్రీకాంత్‌, ఏఈ సందీ ప్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్‌ పాల్గొన్నారు.

భూపాలపల్లి అర్బన్‌: భూపాలపల్లి పురపాలక సంఘం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్‌ లైసెన్స్‌ పన్నులు ఆన్‌లైన్‌లో చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌కుమార్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వ్యాపారస్తులు ఈ నెల 31వ తేదీలోపు పెనాల్టీ లేకుండా పన్ను చెల్లించాలని సూచించారు. గడువు తరువాత ఏప్రిల్‌ 30 వరకు 25శాతం, మే 1 తరువాత 50 శాతం పెనాల్టీ విధించనున్నట్లు హెచ్చరించారు. పన్ను చెల్లింపును కార్యాలయంలో లేదా సీడీఎంఏ తెలంగాణ ఆన్‌లైన్‌ ద్వారా చేయవచ్చని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement