భూపాలపల్లి అర్బన్: తోటి విద్యార్థులను ర్యాగింగ్ చేయడం శిక్షార్హ నేరమని ఎస్పీ సంకీర్త్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో మంగళవారం యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు పరస్పర గౌరవంతో, స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలన్నారు. ర్యాగింగ్‌తో మానసిక, శారీరక ఒత్తిడి కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ర్యాగింగ్ ఘటనలు గమనించిన వెంటనే ప్రొఫెసర్లు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. అవసరమైతే హెల్ప్‌లైన్ 18001805522, డయల్ 100 వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, పోలీస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎస్పీ సంకీర్త్


