అంతర్మథనం | - | Sakshi
Sakshi News home page

అంతర్మథనం

Mar 17 2026 7:34 AM | Updated on Mar 17 2026 7:34 AM

అంతర్మథనం

గ్రామాల సమస్యలు ఎలా..

మండలసభలు లేక సర్పంచ్‌ల ఆవేదన

భూపాలపల్లి అర్బన్‌: కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు గ్రామ సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయడానికి సరైన వేదిక దొరకడం లేదు. గతంలో మండల పరిషత్‌ పాలకవర్గాలు ఉన్నప్పుడు మూడు నెలలకోసారి మండల సభలు నిర్వహించేవారు. అప్పుడు మండల సభలలో సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలు అధికారులకు తెలిపేవారు. దీంతో అధికారులకు సర్పంచ్‌లకు మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉండేది. ఇప్పుడు రెండేళ్లుగా ఎన్నికలు లేక మండల సభలు జరగడం లేదు. గత డిసెంబర్‌లో కొత్తగా ఎన్నికై న సర్పంచ్‌లు తమ గ్రామ సమస్యలు ఎలా తెలుపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలలకోసారి మండల సభలు

గతంలో మండల పరిషత్‌ పాలకవర్గాలు ఉన్న సమయంలో ఎంపీపీ అధ్యక్షతన ఎంపీటీసీలు సభ్యులుగా ప్రతీ మూడు నెలలకోసారి మండల సర్వసభ్య సమావేశాలు నిర్వహించేవారు. సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా సర్పంచ్‌లు హాజరయ్యేవారు. డివిజన్‌ స్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యేవారు. మండలంలో ప్రతీ ప్రభుత్వ శాఖ అధికారి తమ శాఖ మూడు నెలల ప్రగతి నివేదికతో వచ్చేవారు. సమావేశంలో వ్యవసాయ, విద్య, విద్యుత్‌, వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్‌, పీఆర్‌ ఇంజినీరింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌, ఐకేపీ, ఉపాధిహామీ, పశుసంవర్దక, రెవెన్యూ ఇలా 11 శాఖలకు చెందిన అధికారులు తమ మూడు నెలల ప్రగతి నివేదికలు చదివి వినిపించేవారు. ఈ సమయంలో శాఖల వారి అధికారులు తమ నివేదిక చదివినప్పుడు ఆయా గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాల సమస్యలపై ప్రశ్నలు అడిగేవారు. వారు లేవనెత్తిన సమస్యల పరిష్కారం అధికారులు వివరించేవారు. దీంతో సర్పంచ్‌లకు, మండల అధికారులకు మధ్య మంచి సంబందాలు ఏర్పడేవి. డివిజన్‌ స్థాయి అధికారుల రాకతో గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి మండల సభలు వేదికలు అయ్యేవి.

గడువు ముగిసిన వెంటనే గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో స్థానిక సంస్థల పాలన అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్ల అనంతరం గత డిసెంబర్‌ నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. అప్పటికే గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయాయి. పలుచోట్ల సీసీ రహదారులు, మురుగు కాలువలు నిర్మించాల్సి ఉంది. రోడ్ల మరమ్మతులు చేపట్టాలి. వీధిదీపాలు, పారిశుద్ధ్యం మెరుగు తదితర అభివృద్ధి పనుల కోసం నిధుల లేమి వెంటాడుతోంది. ఈ క్రమంలో సర్పంచ్‌లు తమ గ్రామాల సమస్యలు ఎలా తెలపాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మండలస్థాయి అధికారులకు తమకు మధ్య పరిచయం కోసమైనా మండల సభలు నిర్వహిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. మండలసభ ఏర్పాటుచేస్తే అధికారులకు, సర్పంచ్‌లకు మధ్య సమన్వయం ఏర్పడుతుందని అంటున్నారు.

మండల పరిషత్‌ పాలక వర్గాలు లేక ఇబ్బందులు

సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement