కాళేశ్వరం: మహదేవపూర్ మండలం పలుగుల పంచాయతీలో లక్ష్మీదేవర బోనాల పండుగను గ్రామస్తులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజలు నిర్వహించారు. డప్పుచప్పుళ్లతో ఆటపాటలతో బోనం సమర్పించారు. వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారె విజయలక్ష్మి శంకర్, ఉపసర్పంచ్ ఓద్ది చంద్రయ్య, నాయకులు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
సెక్యూరిటీ మేనేజర్‌కు వినతి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలో రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సింగరేణి సెక్యూరిటీ గార్డులకు రన్నింగ్‌టెస్ట్ నిబంధన తొలగించాలని సోమవారం కొత్తగూడెం కార్పొరేట్ సెక్యూరిటీ మేనేజర్‌కు ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ సిబ్బంది ప్రతినిధి బౌతు కమలాకర్ మాట్లాడుతూ.. 20 ఏళ్లుగా సంస్థ ఆస్తుల రక్షణలో నిబద్ధతతో పనిచేస్తున్నామని తెలిపారు. కొత్త టెండర్ ప్రక్రియలో భాగంగా రన్నింగ్ టెస్ట్ నిర్వహించే నిబంధనతో 45నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన అనుభవజ్ఞులైన పాత సిబ్బంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పాత సిబ్బందికి రన్నింగ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్యూరిటీ సిబ్బంది మేరుగు రమేష్, కుమారస్వామి, రాజు, కటకం సతీష్, భోగి రాజేందర్, మారం రామిరెడ్డి, సతీష్ పాల్గొన్నారు.
గ్యాస్ ధరలు తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి సోత్కు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ పరిస్థితుల పేరుతో గ్యాస్ ధరలను పెంచడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. క్రూడాయిల్ ధరల మార్పులను కా రణంగా చూపుతూ ప్రజలపై భారాన్ని మో పడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు వేముల శ్రీకాంత్, నేరెళ్ల జోసెఫ్, యాకుబ్ పాషా, గోలి లావణ్య, ఎండీ సాబీర్, పొనగంటి లావణ్య పాల్గొన్నారు.
రేగొండ: కొత్తపల్లిగోరి మండలంలోని జగ్గయ్యపేటలో ఓ ఇంటి వద్ద గుడుంబా తయారు చేసి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం తనిఖీ చేశారు. ఆ ఇంట్లో 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. గుడుంబా తయారు చేసి అమ్ముతున్న మంద పరుశురాం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా గుడుంబా అమ్మినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో 2023లో జరిగిన హత్య కేసులో కోర్టు విచారణకు హాజరు కాని ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. పలిమెల మండలం పంకెన గ్రామానికి చెందిన పాగే అనిల్, భూపాలపల్లికి చెందిన గోల్కొండ శివ పలుమార్లు కోర్టు విచారణకు హాజరు కాలేదు. మెజిస్ట్రేట్ వారిపై నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. సోమవారం ఎస్సై పవన్ కుమార్ నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.


