ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

Mar 17 2026 7:34 AM | Updated on Mar 17 2026 7:34 AM

ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి

భూపాలపల్లి: సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణిలో అందజేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 52 దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారని, ఆ దరఖాస్తుల పట్ల అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించొద్దన్నారు. ఈ కార్యక్రమంలో కాటారం సబ్‌ కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, ఆర్డీఓ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అశోక్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement