కాన్షీరాం జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

కాన్షీరాం జయంతి వేడుకలు

Mar 16 2026 7:51 AM | Updated on Mar 16 2026 7:51 AM

భూపాలపల్లి రూరల్‌: కాన్షీరాం మహారాజ్‌ 92వ జయంతి వేడుకలు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏ సీ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని ధర్మ సమాజ్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ్‌ పార్టీ జి ల్లా అధ్యక్షుడు కొత్తూరి రవీందర్‌ మాట్లాడు తూ భారతదేశ రాజకీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ, సాంస్కృతిక సమానత్వానికి పునా ది వేసిన బహుజన యోధుడు కాన్షీరాం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నా యకులు సామల శ్రీనివాస్‌ కనకం మల్లయ్య, చిట్యాల శ్రీనివాస్‌, మంద రమేశ్‌, కోరళ్ల శ్యా మ్‌, పుల్ల అశోక్‌, చిర్ర శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

‘గిరిజనేతరుల భూములను పంచాలి’

వాజేడు: వలస గిరిజనేతరుల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివాసులకు పంచాలని నవ నిర్మాణ సేన జిల్లా కన్వీనర్‌ ఎట్టి విద్యాసాగర్‌ అన్నారు. మండల పరిధిలోని గుమ్మడి దొడ్డిలో ఆదివారం హరినాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్టలో ఆచార్య వినోబాబావే భూదాన్‌ ట్రస్ట్‌ బర్డ్‌ ద్వారా పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం దారుణమన్నారు. పేదల భూములను లాక్కున్న ప్రభుత్వం షెడ్యూల్‌ ఏరియాలో ఎల్‌టీఆర్‌ చట్టాన్ని ఉల్లంఘించి వలస గిరిజనేతరులు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని ప్రశ్నించారు. వలస గిరిజనేతరుల వద్ద ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆదివాసులకు పంచాలని డిమాండ్‌ చేశారు. అలా చేయని పక్షంలో నవనిర్మాణ సేన ఆధ్వర్యంలో దశల వారీగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు అశోక్‌, సునీల్‌, సూర్యం, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

పోచమ్మతల్లికి బోనాలు

వాజేడు: మండల కేంద్రంలోని ప్రజలు ఆదివారం పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ప్రతీ ఇంటి నుంచి బోనంతో మహిళలు తరలివెళ్లారు. పోచమ్మతల్లికి చీరె, సారె సమర్పించారు. కోళ్లను కోసుకున్నారు. కుటుంబ సభ్యులతో సహా పోచమ్మ చెట్టు వద్దకు చేరుకున్న భక్తులు సల్లంగా సూడు పోచమ్మ తల్లి అంటూ మొక్కుకున్నారు.

మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌

ములుగు: మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ పండుగని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క పేర్కొన్నారు. రంజాన్‌ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందు, తోఫా పంపిణీ కార్యక్రమానికి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముస్లిం మత పెద్దలతో, సోదరులతో కలిసి ఇఫ్తార్‌ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి నుంచి మత సామరస్యానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉందని తెలిపారు. అన్ని కులాలు, మతాలను సమానంగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని కాపాడుతుందని వెల్లడించారు. పాలకులు ప్రజలందరినీ సమానంగా చూడాలన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలే తప్పా విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. అనంతరం కలెక్టర్‌ దివాకరతో కలిసి ఈద్‌ కా తోఫా కానుకలను అందజేసి ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి, మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ చింత నిప్పుల చంద్రకళ, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల ఆశోక్‌, నాయకులు భగవాన్‌రెడ్డి, వంగ రవియాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement