మల్హర్(కాటారం): మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండలకేంద్రంలోని ఎల్జీ గార్డెన్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... ముస్లిం సోదరులు రంజాన్ మాసం అంతా భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఆచరించే ముస్లిం సోదరులకు ఇచ్చే ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. రంజాన్ పండుగ వారి జీవితాలలో సుఖసంతోషాలను నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ చెర్మన్ కోట రాజబాబు, ఉపాధిహామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేశ్, ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
శ్రీధర్‌బాబు


