భూపాలపల్లి అర్బన్: సింగరేణి కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు ఆలస్యంగా ఇవ్వడం, ప్రమోషన్ పాలసీ అమలు చేయకపోవడం, కార్మికులను వివిధ స్కీముల పేరుతో తొలగించడం వంటి సమస్యలపై జాతీయ కార్మిక సంఘాలు సమాధానం చెప్పాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామెర గట్టయ్య డిమాండ్ చేశారు. ఏరియాలోని యూనియన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో హామీలను ఎంతవరకు అమలు చేశారో బహిరంగ చర్చలో చెప్పాలని ఐఎన్‌టీయూసీ నాయకత్వానికి సవాల్ చేశారు. కార్మికుల ఐక్య పోరాటాలతో సాధించిన హక్కులను కొన్ని జాతీయ సంఘాలు ప్రభుత్వాలు, యాజమాన్యాలతో కుమ్మకై ్క తాకట్టు పెట్టాయని ఆరోపించారు.ఈ సమావేశంలో నాయకులు కాసర్ల ప్రసాద్‌రెడ్డి, దాసరి జనార్దన్, నామల శ్రీనివాస్, రాళ్లబండి బాబు, జయశంకర్, నరసింహారెడ్డి పాల్గొన్నారు.


