భూపాలపల్లి: సోదర భావానికి ప్రతీక రంజాన్ అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్‌తో కలిసి బుధవారం జిల్లా కేంద్రంలో సింగరేణి ఫంక్షన్ హాల్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసం ఆధ్యాత్మికత, సహనం, పరస్పర సహకారం, సామాజిక ఐక్యతకు ప్రతీక అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య, వైస్‌చైర్మన్ అంబాల శ్రీనివాస్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కుమారస్వామి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్‌కుమార్, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సత్యనారాయణరావు


