టేకుమట్ల: ప్రతీ సీజన్‌లో రైతులు పంట మార్పిడి చేసి సాగు చేయడం ద్వారా దిగుబడి పెరిగి అధిక లాభాలను పొందవచ్చని జిల్లా ఉద్యాన శాఖ అధి కారి సునీల్‌కుమార్ తెలపారు. మండలంలోని పంగిడిపల్లిలో గ్లోబల్ డ్రిప్ కంపెనీ ఆధ్వర్యంలో రైతులకు డ్రిప్ పరికరాలు, పంటల్లో వచ్చే చీడపీడల నివారణపై బుధవారం అవగాహన కల్పించి, ఉ ద్యాన మిషన్ పథకం ద్వారా రైతులకు కూరగాయ ల మినీ కిట్లను పంపిణీ చేశారు. అలాగే డ్రిప్ విని యోగంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృషి విజ్ఞా న కేంద్రం రామకిరికిల్ల కీటక శాస్త్రవేత్త వెంకన్న మా ట్లాడుతూ.. పంటల్లో చీడ పీడల నివారణకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. ఏఓ కల్యాణి, ఏఈఓలు రాహుల్, రామాచారి తదతరులు పాల్గొన్నారు.
ఉద్యాన శాఖ జిల్లా అధికారి సునీల్‌కుమార్


