భూపాలపల్లి అర్బన్: జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీని యర్ సివిల్ జడ్జి నాగరాజ్ తెలిపారు. బుధవారం న్యాయవాదులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజీ మార్గాన్ని ఎంచుకొని వివాద రహిత జీవితాలను గడిపేలా కక్షిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కు వ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో గవర్నమెంట్ ప్లీడర్ బోట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసచారి, చీఫ్ లీగల్ ఎయి డ్ డిఫెన్స్ కౌన్సెల్ పుప్పాల శ్రీనివాస్, అదనపు పీపీ రఫీక్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ అక్షయ, న్యాయవాదులు భిక్షపతి, రమేష్, సుభాష్, విష్ణు, మొయినుద్దీన్, సంధ్య పాల్గొన్నారు.


