న్యూస్‌రీల్
కిలోకు రూ.10 నుంచి రూ.12కు కొనుగోలు..
మూడు నెలల క్రితం రేగొండ మండలం బాగిర్ధిపేట క్రాస్‌రోడ్ మీదుగా పీడీఎస్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్న మూడు ట్రాలీలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. టేకుమట్ల బూర్నపల్లి వద్ద సివిల్ సప్లయీస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు గత నెల 11వ తేదీన రెండు ట్రాలీలను పట్టుకొని సుమారు 90 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ప్రతీ నెల ఒకటి రెండు కేసులు నమోదు అవుతూనే
ఉన్నాయి.
భూపాలపల్లి: జిల్లాలో రేషన్ బియ్యం దందా జోరుగా సాగుతోంది. దారిద్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని కొందరు దళారులు ఏడాది క్రితం వరకు మహా రాష్ట్రకు అక్రమంగా తరలించి రూ.కోట్లు గడించా రు. కాగా ఇప్పుడు అక్కడ దందా బంద్ కావడంతో స్థానిక దళారులు ఆ బియ్యాన్ని నేరుగా జిల్లాలోని రైస్‌మిల్లులకే పంపిస్తుండడం గమనార్హం. మిల్లర్లు అవే బియ్యాన్ని బస్తాలు మార్చి సీఎంఆర్ కింద సివిల్ సప్లయీస్ గోదాంలకు తరలిస్తున్నారని, దళారులకు సివిల్ సప్లయీస్ అధికారుల అండదండలు ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అర్ధరాత్రి మిల్లులకు రవాణా..
కూలీలు సేకరించిన, రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేసిన పీడీఎస్ బియ్యాన్ని దళారుల నుంచి జిల్లాలోని కొందరు రైస్ మిల్లర్లు కేజీకి రూ.26 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి, తెల్లవారుజామున టాటా ఏసీ ట్రాలీ, డీసీఎం వ్యాన్లలో గుట్టుచప్పుడు కాకుండా రైస్ మిల్లర్లు చెప్పిన రహస్య ప్రదేశాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బియ్యాన్ని మిల్లర్లు రీ సైక్లింగ్ చేసి తిరిగి సివిల్ సప్లయీస్ గోడౌన్‌లకు పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా కట్టడి చేయాల్సిన సివిల్ సప్లయీస్ శాఖలోని కొందరు అధికారులు ఈ దందాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
రైస్‌మిల్లులకే చేరుతున్న పేదల బియ్యం
జిల్లాలో జోరుగా
అక్రమ వ్యాపారం
రేషన్ డీలర్లు, దళారుల నుంచి మిల్లులకు చేరవేత
రీ సైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద సర్కార్‌కు అప్పగింత
సహకరిస్తున్న
సివిల్ సప్లయీస్
అధికారులు..?
జిల్లాలోని 12 మండలాల్లో సుమారు 1.25 లక్షల తెల్లరేషన్‌కార్డులు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతీ నెల ఒక్కో వ్యక్తికి 6 కేజీల చొప్పున రేషన్ డీలర్ల ద్వారా ఉచితంగా బియ్యాన్ని అందిస్తుంది. అయితే కొందరు దళారులు ఈ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మండలానికో దళారి ఏర్పడి, వారంతా బియ్యం సేకరణ కోసం ప్రత్యేకంగా కూలీలను ఏర్పాటు చేసుకున్నారు. ఆ కూలీలు గ్రామాలు, పట్టణాల్లో రేషన్ బియ్యం తీసుకునే కుటుంబాల నుంచి బియ్యాన్ని కేజీకి రూ.10 నుంచి రూ.12 చొప్పున కొనుగోలు చేసి కమిషన్ పద్ధతిన దళారులకు విక్రయిస్తారు. అంతేకాక పలువురు దళారులు నేరుగా రేషన్ డీలర్లతో డీల్ కుదుర్చుకొని కేజీకి రూ.10 చొప్పున భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఏడాది క్రితం ఈ దళారులంతా రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రలోని ఓ రైస్‌మిల్లుకు తరలించగా, ప్రస్తుతం ఆ రైస్‌మిల్ బంద్ కావడంతో జిల్లాలోని పలు రైస్‌మిల్లులకే తరలిస్తున్నట్లు తెలుస్తోంది.


