కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో మే 21నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగు సరస్వతీనది అంత్యపుష్కరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు రేపు (బుధవారం) రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు రానున్నారు. రూ.1.20కోట్ల వ్యయంతో నిర్మించనున్న మ్యూజియం పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో ఎండోమెంట్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖల ద్వారా జరిగే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిసింది. ఈ మేరకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తుంది.
రూ.21కోట్ల నిధులు మంజూరు
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.35కోట్లతో సరస్వతినది పుష్కరాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సరస్వతీనది అంత్యపుష్కరాలను అదే మాదిరిగా మే నెలలో నిర్వహించడానికి రూ.31.60 కోట్లతో పలు పనులకు ప్రతిపాదనలు పంపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.21కోట్ల నిధులు మంజూరు చేసి పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నిధులతో పుష్కరాల పనులు ప్రారంభం కానున్నాయి.
రూ.1.20కోట్లతో మ్యూజియం పనులకు
శంకుస్థాపన


