ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు పనుల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు పనుల పరిశీలన

Mar 10 2026 12:47 PM | Updated on Mar 10 2026 12:47 PM

ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు పనుల పరిశీలన

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఎంఆర్‌ఐ యంత్రం కోసం అవసరమైన గదులు, మౌలిక వసతులను కలెక్టర్‌ రాహుల్‌శర్మ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, నిరంతర విద్యుత్‌ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎంఆర్‌ఐ యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు అందుతాయని తెలిపారు. పనులను నాణ్యతతో వేగంగా పూర్తిచేసి, ఎంఆర్‌ఐ సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ పరిశీలనలో సంబంధిత వైద్య అధికారులు, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement