రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఉద్యాన పంటలపై అవగాహన

Mar 10 2026 12:47 PM | Updated on Mar 10 2026 12:47 PM

చిట్యాల: మండలంలోని రాంచంద్రాపూర్‌, కై లాపూర్‌ గ్రామ శివారులో జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో రైతులకు ఉద్యాన పంటలపై సోమవారం అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్‌కుమార్‌ హాజరై డ్రిప్‌ పరికరాల పనితీరుపై జైన్‌ డ్రిప్‌ కంపెనీ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉద్యాన పంటల సాగులో రైతులు అనుసరించాల్సిన మెలకువలు, పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్‌ ఫామ్‌ వంటి పంటలను సాగు చేసుకుంటే మార్కెట్‌లో మంచి ధరతో పాటు రైతుల ఆదాయం మెరుగుపడుతుందన్నారు. అనంతరం ఉద్యాన మిషన్‌ పథకం కింద రైతులకు కూరగాయల మినీ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement