తగ్గనున్న దూరభారం | - | Sakshi
Sakshi News home page

తగ్గనున్న దూరభారం

Mar 9 2026 7:31 AM | Updated on Mar 9 2026 7:31 AM

తగ్గనున్న దూరభారం త్వరలోనే అందుబాటులోకి..

కిషన్‌రావుపల్లి ఫారెస్ట్‌ రోడ్డు పనులు షురూ

రూ.4.67 కోట్ల చెల్లింపు

మల్హర్‌: ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన కిషన్‌రావుపల్లి రహదారి నిర్మాణం పనులు మొదలయ్యాయి. ఇప్పటికే ఫారెస్ట్‌ అధికారులు రోడ్డు నిర్మాణానికి అటవీ ప్రాంతంలో హద్దులు ఏర్పాటు చేశారు. మరోవైపు రోడ్డు నిర్మాణానికి గతంలో టెండర్‌ ప్రక్రియ కావడంతో రోడ్డు పనులు నడుస్తుండడంతో ఈ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాడిచర్ల మండల కేంద్రం నుంచి భూపాలపల్లి జిల్లాకేంద్రానికి చేరుకోవాలంటే ప్రస్తుతం కాటారం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వరకు 20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 2017 సంవత్సరంలో అనుమతి వచ్చింది. ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణాన్ని పూర్తిచేశారు. రోడ్డు పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ భూపాలపల్లి వన్‌ఇంకై ్లన్‌ మైన్‌ ఫారెస్ట్‌ రోడ్డులో ఫారెస్ట్‌ అధికారులు నిర్ధారించిన రోడ్డు ప్రదేశంలో మట్టి పనులు చేపడుతున్నారు. మట్టి పనులు పూర్తికాగానే లెవలింగ్‌ పనులు చేపట్టి అవసరమైన చోట కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిసింది.

తగ్గనున్న దూరభారం..

మంథని నుంచి భూపాలపల్లికి వెళ్లాలంటే కాటారం మీదుగా 60 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఖమ్మంపల్లి–తాడిచర్ల మీదుగా కేవలం 30 కిలోమీటర్లలోనే భూపాలపల్లికి చేరుకోవచ్చు. ప్రస్తుతం నిత్యం వందలాది వాహనాలు మంథని మీదుగా సుదూర ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే సగం దూరభారం తగ్గనుండటంతో విద్య, వైద్యం మరింత మెరుగుపడనుంది. సమయంతో పాటు ఇంధన ఖర్చులు భారీగా ఆదా కానున్నాయి. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో తాడిచర్లతో పాటు చుట్టూ ప్రక్కల గ్రామాలు పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతాయి.

కిషన్‌రావుపల్లి ఫారెస్ట్‌లో రానున్న ఆరు నెలల కాలంలో రోడ్డు అందుబాటులోకి వస్తుంది. పిల్లల ఉన్నత చదువులు, మెరుగైన వైద్యానికి అనువుగా ఉంటుంది. ప్రయాణభారం తగ్గుతుంది. జిల్లా కార్యాలయాలకు, ఇతర అవసరాలకు భూపాలపల్లికి వెళ్లడానికి కొయ్యూరు నాగులమ్మ మీదుగా భూపాలపల్లికి పోతున్నాం. ఈ రోడ్డు పూర్తయితే ఉపయోగకరంగా ఉంటుంది. – చింతలపల్లి మల్హల్‌రావు, మాజీ ఎంపీపీ, మల్హర్‌

పెరగనున్న రవాణా సౌకర్యం

పారిశ్రామికంగా మరింత అభివృద్ధి

రిజర్వ్‌ ఫారెస్ట్‌ నుంచి రోడ్డు నిర్మాణానికి మోకాలడ్డిన అటవీశాఖ ఎట్టకేలకు ఒక వరస రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. మల్హర్‌ మండలం పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్‌రావుపల్లి నుంచి అటవీప్రాంతం గుండా భూపాలపల్లి వన్‌ ఇంకై ్లన్‌ మైన్‌ వరకు ఏడు మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టవచ్చని.. కాగా ఆ ప్రాంతంలో తాము నష్టపోతున్న చెట్ల సంపదకు గాను రూ.4.67 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సదరు నిధులు చెల్లించింది. కిషన్‌రావుపల్లి నుంచి భూపాలపల్లి సమీపంలోనే వన్‌ఇంక్‌లైన్‌ వరకు 7 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో టెండర్‌ ప్రకియ పూర్తయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement