మల్హర్(కాటారం): రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీల్లో కాటారం మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రామిళ్ల అనయ గోల్డ్‌మోడల్ సాధించించి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి–13 విభాగం ఆర్చరీ పోటీల్లో అనయ 360లో 354 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 26వ తేదీ నుంచి విజయవాడలో జరగనున్న జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలలో అనయ తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించనున్నట్లు కోచ్ నగేష్ వెల్లడించారు. కోచ్ నగేష్, కుటుంబ సభ్యులు, తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ ఆమెను అభినందించారు. రాబోయే జాతీయ స్థాయి పోటీలలో అనయ మరింత ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మరిన్ని విజయాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
వంట గ్యాస్ ధరలు
తగ్గించాలి
భూపాలపల్లి అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు అదనపు భారం అవుతుందని తెలి పారు. దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు అ ప్పగిస్తూ పేద ప్రజలపై భారాలు మోపడం కేంద్ర ప్రభుత్వ విధానమైందని విమర్శించారు.
చేనేత కార్మికురాలికి సన్మానం
కాళేశ్వరం: జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మహదేవపూర్ టస్సర్ కాలనీకి చెందిన చేనేత కార్మికురాలు గొర్రె కావ్యను ఆదివారం శాలువాతో సన్మానించారు. ప్రశంస పత్రం అందజేశారు. భూపాలపల్లి జిల్లా నుంచి ఆమెను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
నిరసన సెగ
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఏరియాలోని ఐఎన్‌టీయూసీ కార్యాలయంలో ఆది వారం రాత్రి నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్‌ప్రసాద్‌కు నిరసన సెగ ఎదురైంది. స్థానిక యూని యన్ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశాన్ని బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జనక్‌ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసగిస్తుండగా యూనియన్ నాయకులు కొందరు నిల్చొని జనక్‌ప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదానాలు చేస్తూ స్టేజీపైకి దూసుకెళ్లారు. ఏడాది కాలంగా మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని, సొంతింటి పథకం కల నెరవేర్చడం లేదని, వేజ్‌బోర్డు కోసం నిర్ణయం తీసుకోవడం లేదని విమర్శించారు. మెడికల్ బోర్డు నిర్వహించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ విధానాలతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదని మండిపడ్డారు. దీంతో స్పందించిన జనక్‌ప్రసాద్ త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను ఐఎన్‌టీయూసీ మాత్రమే పరిష్కరిస్తుందన్నారు.
నిరంతర విద్యుత్
ములుగు రూరల్: మండల పరిధిలోని మల్లంపల్లి ట్యాపింగ్ పాయింట్ నుంచి 3/11 కేవీ పత్తిపల్లి వరకు నిర్మించిన 33కేవీ ఇంటర్ లింక్ లైన్‌ను విజయవంతంగా చార్జీ చేసినట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆనందం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. ఇంటర్ లింక్‌లైన్ ద్వారా కాసిందేవిపేట, పత్తిపల్లి సబ్ స్టేషన్‌లకు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందించవచ్చని తెలిపారు.


