భూపాలపల్లి అర్బన్: అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించే మహాశక్తి మహిళలకు ఉందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల సాధికారత సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణానికి నిజమైన దారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీ్త్రమూర్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని, గ్రంథాలయానికి వచ్చి చదువుకునే మహిళా పాఠకులను శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి, లైబ్రేరియన్ రాణి, పాఠకులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
కోట రాజబాబు


