భూపాలపల్లి అర్బన్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇల్లందు క్లబ్‌లో శనివారం మహిళలతో పాటు మహిళా ఉద్యోగులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. భూపాలపల్లి ఏరియాలోని గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు, లేడీస్ క్లబ్ సభ్యులు ఈ పోటీలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సింగరేణి సేవా అధ్యక్షురాలు సునీత రాజేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. గెలుపొందిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు.


