సర్వర్‌ సమస్య | - | Sakshi
Sakshi News home page

సర్వర్‌ సమస్య

Mar 7 2026 7:26 AM | Updated on Mar 7 2026 7:26 AM

సర్వర్‌ సమస్య

జిల్లాలో సమస్యలు ఇలా..

జిల్లాలో ఇలా..

ఉపాధిహామీలో కొత్తవిధానం

సర్వర్‌ సమస్యలు అప్‌డేట్‌..

కాళేశ్వరం: ఉపాధిహామీ పథకంలో మరింత పారదర్శకత కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువచ్చింది. పనులకు వచ్చే కూలీలకు (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ముఖహాజరు విధానాన్ని అమలు చేస్తుంది. పథకంలో వెలుగుచూసిన అక్రమాలు, అవకతవకలు అరికట్టడంతో పాటు కూలీలకు సరైన న్యాయం చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త విధానానికి ఆదిలోనే సమస్యలు వెల్లువెత్తుతున్నాయి.

సర్వర్‌ సమస్య..

ఇంతకు ముందు కూలీలందరినీ ఒక బృందంగా ఫొటో తీసి (ఎన్‌ఎంఎంఎస్‌) నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ యాప్‌లో నిక్షిప్తం చేసేవారు. కొత్త విధానం అమలు ద్వారా ప్రతి కూలీ ముఖాన్ని స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఈ–కేవైసీ పూర్తయిన కూలీలకు మాత్రమే పని ప్రదేశంలో సాఫ్ట్‌వేర్‌ గుర్తిస్తుంది. తద్వారా వేరొకరి పేరిట హాజరు వేయడం అసాధ్యమవుతుంది. ఈ–కేవైసీ పూర్తి చేసుకుంటేనే ఉపాధిహామీ పథకంలో పనికి తగిన వేతనం లభించే అవకాశం ఉంటుంది.

మార్చి 1 నుంచి..

ప్రస్తుతం కొత్త విధానం మార్చి 1 నుంచి అమలులోకి వచ్చింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ సిగ్నల్‌ సమస్య ముఖగుర్తింపు విధానానికి సవాలుగా మారుతుంది. శివారు ప్రాంతాల్లో కూలీలు పనిచేయాల్సి ఉంది. ఇక్కడ సిగ్నల్‌ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనిని అధిగమించేందుకు పని ప్రదేశంలో ఫొటోలు తీసుకొని సిగ్నల్‌ వచ్చే ప్రాంతాలకు వెళ్లి అప్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పిస్తేనే ఇబ్బందులు రావని పలువురు ఫీల్డ్‌అసిస్టెంట్లు అంటున్నారు. దీంతో ప్రతీ కూలీ ఐరిస్‌(కంటి ఆధారిత) ద్వారా తీసుకొని తరువాత గ్రూప్‌ ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది. పని ప్రారంభం ముందు..నాలుగు గంటల తరువాత మరో ఫొటో తీయాలని నిబంధన విధించారు. చాలా మంది కూలీలకు ఈకేవైసీ పూర్తయినప్పటికీ యాప్‌లో ఐరిస్‌ క్యాప్చర్‌ కావడం లేదు. ఉదాహరణకు 50–60 మంది కూలీలు పనికి వస్తే నాలుగు నుంచి ఐదుగురికి క్యాప్చర్‌ అవుతుంది. ఫొటోకు ఫొటోకు మధ్యన సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ఫీల్డ్‌అసిస్టెంట్లకు భారం పెరిగిందని అంటున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కూలీలు మొరపెడుతున్నారు. దీంతో మొదటి రెండు రోజులు కొంత మంది వేచి చూసి వెనుదిరిగారని తెలిసింది. ఉపాధిహామీ పనులకు వచ్చే వారికి సర్వర్‌ సమస్యలకు అధికారులు కొంత మినహాయింపు ఇచ్చారు. జన్మనరేగా యాప్‌తో మస్టర్లు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.

చిట్యాల మండలంలో మొదటి రోజు సోమవారం పనికి వచ్చిన కూలీలకు మస్టర్‌ పడకపోవడంతో తిరిగి వెళ్లారు. దీంతో రెండు రోజుల ముందుగానే మస్టర్‌ డిమాండ్‌ ఫా రంలో కూలికి వచ్చే వారి పేర్లు నమోదు చేసి జన్మనరేగా యాప్‌తో మస్టర్లు వేస్తున్నారు.

మొగుళ్లపల్లి మండలం కొర్కిశాలలో ఐరిస్‌తో ఇబ్బందులు తప్పడం లేదు.

టేకుమట్ల మండలం రామకృష్ణపూర్‌లోని సర్వర్‌ డౌన్‌ ఉండడంతో టేకుమట్లకు వచ్చి మస్టర్‌ నమోదు చేస్తున్నారు. కూలీలు పనిచేసి తిరిగి వచ్చి ఫొటోదిగి వెళ్తున్నారు. ఇలా నాలుగుసార్లు వచ్చిపోతున్నారు.

పలిమెల మండలంలో సర్వర్‌ సమస్యతో మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది.

మహదేవపూర్‌ మండలంలో బీరసాగర్‌, ఏన్కపల్లిలో సర్వర్‌ సమస్యలు వస్తున్నాయి. దీంతో యాప్‌తో మధ్యాహ్నం ఒంటి గంట వరకు మస్టర్లు వేస్తున్నారు. ఉదయం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు సర్వర్‌ పని చేస్తుంది. ఆ తరువాత పని చేయడం లేదు.

మహాముత్తారం మండలం సింగారం, బోర్లగూడెం, నర్సింగపూర్‌ గ్రామాల్లో సర్వర్‌ పని చేయడం లేదు.

మల్హర్‌లో చిన్నచిన్న సమస్యలు వస్తున్నాయి.

ఆదిలోనే సమస్యలు

కంటిఆధారితంగా తీసుకోని క్యాప్చర్‌

సర్వర్‌ సమస్యలు సరిచేయాలని కూలీల మొర

ప్రస్తుతం నాలుగువేల మందికి

అటెండెన్స్‌

ఉపాధిహామీలో కొత్త విధానంతో సమస్యలు ఉన్నది వాస్తవమే. కానీ త్వరలో అప్‌డేట్‌ చేస్తారు. గ్రామాల్లో సర్వర్‌ సమస్యలతో ఇబ్బందులను గుర్తించాం. కూలీల హాజరుకు ఇబ్బంది లేదు. మొత్తం ఏడు వేల మంది కూలీలు పనికి వచ్చేవారు ఉండగా.. రెండు రోజులుగా నాలుగు వేలకు పైన కూలీలకు అటెండెన్స్‌ వేశారు. త్వరలో అన్ని పరిష్కారం అవుతాయి.

– బాలకృష్ణ, డీఆర్‌డీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement