కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మార్కింగ్ చేయడానికి వచ్చిన తనను పబ్లిక్ బెదిరిస్తున్నారని, వారు చెప్పినట్లు మార్కింగ్ ఇవ్వాలని అంటున్నారని నిరసిస్తూ హౌసింగ్ ఏఈ బైఠాయించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం చక్కర్లు కొట్టింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ఏఈ మాట్లాడిన తీరు.. తాను ప్రభుత్వ నిబంధనల మేరకు పని చేస్తానని.. స్లాబ్ ఏరియా 600 స్క్వేర్‌ఫీట్లు మించొద్దని చెప్పినా కొంతమంది వినిపించుకోవడం లేదన్నారు. తనను బెదిరిస్తున్నారని వాళ్ల డాడీకి ఫోన్ చేసి ఇంటికి ఉద్యోగం వదిలి వెళ్లొస్తానని తెలిపారు. కలెక్టర్, గవర్నర్‌కు చెప్పి ఇక్కడికి తీసుకురావాలని అతడి డాడీతో బాధ వ్యక్తం చేశాడు. లేకపోతే సచ్చిపోతానని తెలిపాడు. మర్యాద లేదని, తనది కోపం కాదు.. బాధ అంటు కష్టపడి చదువుకొని ఉద్యోగంలోకి వచ్చాను.. ఓట్లకు నోట్లు ఇచ్చి గెలువలేదని అన్నాడు. పక్కనే ఉన్నవారంత నచ్చజెప్పి ఏఈని అలా మాట్లాడొద్దని బతిమిలాడారు. అనంతరం ఏఈ జిల్లా ఉన్నతాధికారికి కూడా ఫోన్ చేసి బాధను వివరించాడు. ఇటీవల జరిగిన ఈ విషయం ప్రజల వ్యవహారశైలితో విసుగు చెందిన ఏఈ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయమై మహదేవపూర్ ఎంపీడీఓ రవీంద్రనాథ్‌కు ఫోన్‌చేయగా అందుబాటులోకి రాలేదు.


