‘ప్రగతి ప్రణాళిక’ ఘనంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రగతి ప్రణాళిక’ ఘనంగా నిర్వహించాలి

Mar 7 2026 7:26 AM | Updated on Mar 7 2026 7:26 AM

‘ప్రగతి ప్రణాళిక’ ఘనంగా నిర్వహించాలి

భూపాలపల్లి: జిల్లాలో సమగ్ర అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల నిర్వహణకు ప్రతీ శాఖకు సంబంధించి నోడల్‌ అధికారులను నియమించామన్నారు. ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు శుభ్రత, ఫైల్‌ క్లియరెన్స్‌ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఏప్రిల్‌ 6 నుంచి ఏప్రిల్‌ 11 వరకు రోడ్డు భద్రత అలైవ్‌–అరీవ్‌ అనే థీమ్‌తో రోడ్డు భద్రతపై అవగాహన, ఏప్రిల్‌ 13 నుంచి 18వ తేదీ వరకు మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జూన్‌ 12వ తేదీ వరకు శాఖలకు కేటాయించిన తేదీల్లో ఆయా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement