సాక్షి, మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణపై శుక్రవారం మహబూబాబాద్‌లో ఉమ్మడిజిల్లా అధికారుల సమావేశం జరగనుంది. సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతోపాటు, ముఖ్య అధికారులు పాల్గొననున్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో 99 రోజుల ప్రణాళికపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ విషయాన్ని కింది స్థాయి అధికారులకు చేరవేయడం, ఇందులోని ముఖ్యాంశాలను నేడు జరిగే సమావేశంలో వివరించనున్నారు.
ప్రజాపాలన, ప్రగతి ప్రణాళికపై సమీక్ష..
హాజరు కానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులు


