దరఖాస్తు గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తు గడువు పెంపు

Mar 6 2026 8:17 AM | Updated on Mar 6 2026 8:17 AM

భూపాలపల్లి అర్బన్‌: స్పోర్ట్స్‌ స్కూల్‌ ప్రవేశాల దరఖాస్తు గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు డీవైఎస్‌ఓ రఘు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తున్నట్లు చెప్పారు.

ఇంటర్‌ పరీక్షకేంద్రం తనిఖీ

చిట్యాల: మండలకేంద్రంలోని మోడల్‌స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షలను అదనపు కలెక్టర్‌ ఎల్‌.విజయలక్ష్మి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కళాశాల సిబ్బందికి సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ జయశ్రీ ఉన్నారు.

కార్మిక చట్టాలపై అవగాహన

భూపాలపల్లి అర్బన్‌: ఏరియాలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికులకు నూతన కార్మిక చట్టాలపై జీఎం కార్యాలయ ఆవరణలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లేబర్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ నాగశేషు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన కార్మిక కోడ్‌ల ముఖ్యాంశాలను కార్మికులకు వివరించారు. నూతన కార్మిక కోడ్‌ల అమలుతో దేశ కార్మిక చరిత్రలో కొత్త దశ ప్రారంభమైందని తెలిపారు. కార్మిక సంక్షేమం, భద్రత, కనీస వేతనాలు, గౌరవప్రదమైన జీవన విధానానికి ఈ చట్టాలు ప్రాధాన్యం ఇస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (సివిల్‌) రవికుమార్‌, డీవైఎస్‌ఈ అశోక్‌రెడ్డి, పర్సనల్‌ ఆఫీసర్‌ శ్రావణ్‌కుమార్‌, సివిల్‌ సూపర్‌వైజర్లు, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు.

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి రూరల్‌: హైదరాబాద్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ నివాసంలో ప్రభుత్వ సలహాదారు, రా జ్యసభకు ఎంపికై న వేం నరేందర్‌ రెడ్డిని గురువారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అంగన్‌వాడీలను సద్వినియోగం చేసుకోవాలి

మొగుళ్లపల్లి: అంగన్‌వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి అన్నారు. గురువారం రంగాపురం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం–2లో నిర్వహించిన బారసాల, అక్షరాభ్యాసం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరి మాట్లాడుతూ గర్భిణులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మిస్తారన్నారు. స్థానికంగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినడం ద్వారా ప్రతిరోజు అంగన్‌వాడీలో అందించే పాలు, గుడ్డు, భోజనం చేస్తే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. చిరుధాన్యాలు ఖచ్చితంగా ఒకపూట భోజనంలో చేర్చుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రేసు మమత, అంగన్‌వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement