ఎస్‌ఎస్‌తాడ్వాయి: పోడు భూముల్లో కందకాలు తీస్తున్న అటవీశాఖ అధికారులను మంగళవారం కాల్వపల్లి రైతులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులకు పోడు రైతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాల్వపలి రైతులు భూపాలపల్లి జిల్లాలోని దూదేకులపల్లి రేంజ్ పరిధి సంగారం బీట్ పరిధిలో 25 ఏళ్లుగా సుమారుగా 162 ఎకరాల్లో 47 కుటుంబాలు పోడు భూములను సాగుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం అటవీశాఖ అధికారులు రైతుల పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు భూముల చుట్టూ జేసీబీతో కందకాలు తవ్వుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న రైతులు అక్కడకు చేరుకుని తవ్వకాల పనులను అడ్డుకోవడంతో అటవీశాఖ అధికారులు, రైతులు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములే తమకు జీవనాధారమని వాటిని వదిలే ప్రసక్తే లేదని బాధిత రైతులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు తిరిగి వెళ్లిపోయారు.
అటవీశాఖ అధికారులను
అడ్డుకున్న రైతులు


