హనుమంత వాహనసేవలో.. | - | Sakshi
Sakshi News home page

హనుమంత వాహనసేవలో..

Mar 3 2026 8:18 AM | Updated on Mar 3 2026 8:18 AM

హనుమంత వాహనసేవలో..

రేగొండ: మండలంలోని కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి హనుమంత వాహనసేవలో స్వామి వారిని మాడ వీధుల గుండా ఊరేగించారు. ఉదయం నిత్య విధి పూజలు, హోమం నిర్వహించారు. బలిహరణం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామి వారికి దోపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అరగింపు, తీర్థప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ నాయినేని సంపత్‌ రావు, ఆలయ ఈఓ మహేష్‌, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు కనుకుంట్ల దేవేందర్‌, ఆలయ సిబ్బంది రవిందర్‌, శ్రావణ్‌, సుధాకర్‌, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రేపటి నుంచి జాతర ప్రారంభం

కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు (మంగళవారం) హోలీ పండుగ రోజున చంద్రగ్రహణం ఉన్నందున ఉదయం నిత్యవిధి, హోమ, బలిహరణములు, మహాపూర్ణాహుతి, నైవేద్యం తదుపరి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయం మూసివేయనున్నారు. బుధవారం బోనాలు తిరుగుటతో జాతర ప్రారంభమవుతుంది. సాయంత్రం పెద్ద రథోత్సవం, శ్రీ స్వామి వారి, అమ్మ వార్ల గజవాహనముల ఊరేగింపు, ఎడ్లబండ్లు, ప్రభబండ్లు, ఇతర వాహనాలు తిరుగు కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement