యూడీఐడీ కార్డుల ప్రక్రియ వేగవంతం | - | Sakshi
Sakshi News home page

యూడీఐడీ కార్డుల ప్రక్రియ వేగవంతం

Mar 3 2026 8:18 AM | Updated on Mar 3 2026 8:18 AM

భూపాలపల్లి అర్బన్‌: రాబోయే రెండు నెలల్లో నమోదు చేసుకున్న ప్రతీ దివ్యాంగుడికి యూడీఐడీ కార్డు, సదరం సర్టిఫికెట్‌ అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని చర్యలు చేపట్టాలని వికలాంగుల సాధికారత విభాగం (దివ్యాంగజన సశక్తికరణ విభాగం), సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ కార్యదర్శి వి.విద్యావతి ఆదేశించారు. ఆస్పిరేషన్‌ జిల్లాల్లో యూడీఐడీ(ఈఐఈ) కార్డుల జారీపై సోమవారం భారత ప్రభుత్వ కార్యదర్శి విద్యావతి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పిరేషన్‌ జిల్లాల్లో దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు జారీ చేసే ప్రక్రియ, నమోదు పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించే విధానంపై సమగ్రంగా వివరించారు. జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక చర్యలను కలెక్టర్‌ రాహుల్‌శర్మ వివరించారు. ఈ సమావేశంలో ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లు, డీఆర్‌డీఓ, డీపీఎం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు కలెక్టర్‌ రాహుల్‌శర్మ సోమవారం ఒక ప్రకటనలో హోలీ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగ హోలీ ప్రతీ ఇంటా ఆనందం, ఐక్యత, స్నేహభావాలను నింపాలని ఆకాంక్షించారు. హోలీ మన సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన పండుగ అన్నారు. చెడుపై మంచి విజయం సాధించిన సంకేతంగా ఈ పండుగను జరుపుకుంటామని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement