నేడు పదహారు పండుగ | - | Sakshi
Sakshi News home page

నేడు పదహారు పండుగ

Mar 2 2026 7:29 AM | Updated on Mar 2 2026 7:29 AM

నేడు

నేడు పదహారు పండుగ

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరాలయంలో మహా శివరాత్రి సందర్భంగా శ్రీశుభానంద–ముక్తీశ్వరుల కల్యాణం జరిగి (నేడు)సోమవారానికి 16 రోజులు అవుతున్న సందర్భంగా పదహారు రోజుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్‌ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రధాన ఉత్సవ మూర్తుల కల్యాణం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధికసంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

నిందితులతో కఠినంగా ఉండాలి

చిట్యాల: శాంతిభద్రతల పరిరక్షణపై బాధితులతో స్నేహంగా, నిందితులతో కఠినంగా ఉండాలని చిట్యాల సీఐ మల్లేష్‌ అన్నారు. పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణపై ఆదివారం మండల కేంద్రంలో సీఐ మల్లేష్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా ఉండాలన్నారు. వారి సమస్యలను సానుభూతితో విని భరోసా కల్పించాలని తెలిపారు. తప్పు చేసిన నిందితుల పట్ల మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పోలీస్‌ సిబ్బంది డ్యూటీకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా లాఠీలు వెంట తీసుకెళ్లాలని అన్నారు. విధి నిర్వహణలో పోలీస్‌ సిబ్బంది నిజాయితీగా పని చేయాలని కోరారు. ప్రతీఒక్కరు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావన్‌కుమార్‌, ఎస్సై–3 ఈశ్వరయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

అమరులకు నివాళులు

భూపాలపల్లి రూరల్‌: ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అసువులు బాసిన అమరులకు ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో నివాళులర్పించారు. ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌ అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌, ఎంస్‌పీ అనుబంధ సంఘాల నాయకులు గాజుల భిక్షపతి మాదిగ, దోర్నాల రాజేందర్‌, అంతడుపుల సురేష్‌, సుమన్‌, నేరుపటి అశోక్‌, ఎర్ర భద్రయ్య మాదిగ పాల్గొన్నారు.

యాదాద్రిలో ఎమ్మెల్యే గండ్ర దంపతుల పూజలు

భూపాలపల్లి రూరల్‌: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు–పద్మ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. పూజారులు ప్రత్యేక పూజ లు చేశారు. అనంతరం ఆలయ మండపంలో దేవస్థాన అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

రామప్ప శిల్పకళ అద్భుతం

వెంకటాపురం(ఎం): రామప్ప శిల్పకళ సంపద అద్భుతంగా ఛత్తీస్‌ఘడ్‌ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జు వెంకటేశ్వర్‌ కొనియాడారు. మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని ఆయన ఆదివారం సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను గైడ్‌ విజయ్‌కుమార్‌ వివరించగా రామప్ప ఆలయం బాగుందని కొనియాడారు. అమెరికాకు చెందిన క్రిస్‌ రామప్ప ఆలయాన్ని సందర్శించారు. ఆలయ విశిష్టతను గైడ్‌ వివరించగా టెంపుల్‌ బ్యూటిఫుల్‌ అంటూ కొనియాడారు.

నేడు పదహారు పండుగ
1
1/2

నేడు పదహారు పండుగ

నేడు పదహారు పండుగ
2
2/2

నేడు పదహారు పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement