సండే సందడి
రామలింగేశ్వరస్వామికి పూజలు
వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయంలో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. వీకెండ్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు.
గోవిందరావుపేట: మండల పరిధిలోని పర్యాటక ప్రాంతమైన లక్నవరంలో ఆదివారం పర్యాటకులు సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో లక్నవరం సరస్సుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చి ప్రకృతి అందాలను చూసి ఆనందంగా గడిపారు. తేలాడే వంతెనపై నడుస్తూ.. సరస్సులో బోటు షికారు చేస్తూ సందడిగా గడిపారు.
సండే సందడి


