
సమాచార హక్కు చట్టం వజ్రాయుధం
● సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: సమాచార హక్కు చట్టం ప్రజలకు వజ్రాయుధమని ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం వారోత్సవాల్లో భాగంగా శనివారం ఏరియా జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి జీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అనేది ప్రజాస్వామ్య భారతదేశంలో పారదర్శకత, జవాబుదారీతనానికి ఒక బలమైన సాధనమన్నారు. భూపాలపల్లి ఏరియాలో ఈ చట్టాన్ని అమలు చేయడంతో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించడానికి అధికారులు కృషిచేయాలని సూచించారు. అనంతరం అఽధికారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు కవీంద్ర, రవికుమార్, రాజేశ్వర్, ఎర్ర న్న, మారుతి, ప్రదీప్, కార్తీక్, రాజు పాల్గొన్నారు.