
బాలలు హక్కులను తెలుసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: బాలలు హక్కులను తెలుసుకొని వాటిని సాధించుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌ఆర్ దిలీప్‌కుమార్ నాయక్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్ సివిల్ జడ్జి హాజరై మాట్లాడారు. భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపతిముర్మును ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. బాల్య వివాహాలకు దూరంగా ఉండాలన్నారు. బాలికలు నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆకాంక్షించారు. సమాజంలో పాతుకుపోయిన దురాచారా లను అధిగమించి ముందుకు సాగాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి అఖిల పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీపీ సుధాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసచారి, శ్రావణ్‌రావు, ఎస్‌ఓ ఈశ్వరి, న్యాయవాదులు పాల్గొన్నారు.
జూనియర్ సివిల్ జడ్జి దిలీప్‌కుమార్ నాయక్