
దిగుబడి కష్టమే..
నాలుగెకరాలు కౌలుకు తీసుకొని పత్తిసాగు చేఽశాను. రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చు అయింది. తీవ్ర వర్షాలతో దిగుబడి కష్టంగా మారింది. వేరు చక్కగా ఎదిగే సమయంలో అధిక వర్షాలతో రోగాలు అంటుకున్నాయి. పత్తి చేలు ఎర్రబడి ఎండిపోతున్నాయి. రోజుల వ్యవధిలోనే మాయదారి రోగం మొత్తం పాకింది. పత్తి మొక్కలు ఆకురాలి మోడులై కనిపిస్తున్నాయి. రెండోసారి వచ్చే పూత, కాతను దక్కించుకుందామంటే చీడపీడలు ముసురు కున్నాయి. ఇప్పటికే ఎరువులు వేశాం. మందులు కొట్టాం. ప్రతీసారి కంటే ఈ ఏడు ఎక్కువ పెట్టుబడి అయింది. దిగుబడులు చేతికొచ్చే సమయంలో వర్షాలు దెబ్బకొట్టాయి.
– సల్పాల కుమార్, టేకుమట్ల (రామకృష్ణపూర్ టి)