
నల్లమచ్చలు అధికం
మద్దులపల్లిలో మూడెకరాల్లో పత్తి సాగు చేశాను. మొత్తం రూ.లక్ష వరకు పెట్టుబడికి ఖర్చు అయింది. కానీ తీవ్ర వర్షాలతో పత్తి మొక్కలు దెబ్బతిన్నాయి. పత్తి నల్లబడింది. పత్తి కాయలు మురిగి పోతున్నాయి. మొక్కకు 30 నుంచి 40 కాయల వరకు పాడయ్యాయి. తెల్లదోమ, పచ్చ దోమ సోకింది. పూత, కాయంతా రాలిపోతోంది. చీడపీడల అదుపు కోసం మందులు పిచికారీ చేద్దామన్నా వానలతో చేయలేదు. ఈ సీజన్‌లో పెట్టబడులు రావడమే కష్టంగా ఉంది. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి.
– బియ్యని శ్రీకాంత్, మద్దులపల్లి