
10నుంచి 17..
తగ్గుముఖం పట్టాయి..
వాతావరణ మార్పులతో ప్రమాదం..
రోజుకు
జిల్లాలో తగ్గని జ్వరపీడితులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు
భూపాలపల్లి అర్బన్: వర్షాకాలం సీజన్ ముగింపు దశకు వచ్చినప్పటికీ జిల్లాలో జ్వరపీడితులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో తగ్గడం లేదు. వైద్యారోగ్య శాఖ అధికారులు ముందస్తుగా వైద్యశిబిరాలు ఏర్పాటుచేయడం, ఇంటింటా జ్వర సర్వే చేయడంతో ఇరవై రోజులుగా జ్వరాలు గతంకంటే తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఇప్పటికీ ప్రతిరోజు 10నుంచి 17 మంది జ్వరపీడితులు నమోదవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ పదుల సంఖ్యలో జ్వరపీడితులు వైద్యసేవలు పొందుతున్నారు.
సెప్టెంబర్ నుంచే తగ్గుముఖం
జిల్లాలో జూలై, ఆగస్టు మాసాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలాయి. అయినప్పటికీ ముందస్తుగా తెలుసుకొని సకాలంలో నయం చేసుకున్నారు. ఈ ఏడాది జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఆగస్టు మాసంలో 821 జ్వరం కేసులు నమోదు కాగా, సెప్టెంబర్ మాసంలో 540 కేసులు నమోదు కాగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 300 మంది వరకు అడ్మిట్ అయ్యారు. ఈ నెలలో రోజుకు 10 నుంచి 17 కేసుల వరకు నమోదవుతున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.
42 డెంగీ కేసులు నమోదు..
జిల్లాలో గతేడాది 60 వరకు డెంగీ, 12 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది సెప్టెంబర్ వరకు 42 డెంగీ, 10 మలేరియా కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే డెంగీ, మలేరియా కేసుల నమోదు సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది. ప్రజల్లో సైతం అవగాహన పెరగడంతో దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. గ్రామాల్లో డెంగీ, మలేరియా కేసులు నమోదైన వెంటనే వైద్యారోగ్యశాఖ అధికారులు మెడికల్ క్యాంపులు నిర్వహించడంతో వ్యాధులు ఇతరులకు ప్రబలకుండా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ, గ్రామ పంచాయతీ సిబ్బందిని కలుపుకొని పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
చిట్యాల సివిల్ ఆస్పత్రిలో వారం రోజుల్లో 756మంది రోగులు ఓపీ చూపించుకున్నారు. వీరిలో 138మంది జ్వరపీడితులు అడ్మిట్ అయి చికిత్స పొందారు. గురువారం 77మంది ఓపీ చూపించుకోగా.. 15మంది జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గ్రామాల్లోనీ ఆర్‌ఎంపీల వద్ద కూడా పదుల సంఖ్యలో జ్వరపీడితులు చికిత్స పొందుతున్నారు.
మాది జడలపేట గ్రామంలోని గాంధీనగర్. జ్వరంతో 108లో గురువారం ఉదయం చిట్యాల సివిల్ ఆస్పత్రికి వచ్చాను. పరీక్షించిన వైద్యుల్ అడ్మిట్ చేసుకుని మంచి వైద్యసేవలు అందిస్తున్నారు.
– బొట్ల రాధ, గాంధీనగర్, జడలపేట
కొనసాగుతున్న హెల్త్ క్యాంపులు
జీజీహెచ్‌కు గతంకంటే తగ్గిన ఓపీ
చలితో పెరిగే ప్రమాదం
జిల్లాలో గత నెల రోజుల నుంచి సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు చుట్టు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. శీతా కాలం ప్రారంభంతో తగు జాగ్రత్తలు పాటించాలి. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ సిబ్బందిని అప్రమత్తంగా ఉన్నారు. ఎక్కడ జ్వరాలు వచ్చిన వెంటనే ఎపిడమిక్ టీమ్ వెళ్లి క్యాంపులు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
– డాక్టర్ చల్ల మధుసూదన్, డీఎంహెచ్‌ఓ
అక్టోబర్ మాసంలో వాతావరణ మార్పులు సంభవిస్తాయి. వర్షకాలం ముగిసి శీతాకాలం ప్రారంభమయ్యే కాలం. శీతాకాలం ప్రారంభంలో జరుగుతున్న మార్పుల వలన చిన్న పిల్లలు, వృద్ధులు జ్వరాలు, జలుబుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉంటే ఈ ప్రమాదం నుంచి కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి.

10నుంచి 17..

10నుంచి 17..

10నుంచి 17..

10నుంచి 17..

10నుంచి 17..

10నుంచి 17..