
లక్షపత్రి పూజలకు బుకింగ్ ప్రారంభం
కాళేశ్వరం: కార్తీక మాసం సందర్భంగా ఈనెల 21 నుంచి నవంబర్ 19 వరకు కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో లక్షపత్రి పూజలకు రూ.8వేలు చెల్లించి అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు తీసుకోవాలని ఈఓ ఎస్.మహేష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక రోజు ఐదు పూజలు మాత్రమే చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 90004 80931, 97046 39706 నంబర్లలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.
గణపురం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ వేయడానికి ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ ఫణీందర్ రెడ్డి గురువారం పరిశీలించారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు నామినేషన్‌ల ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టేకుమట్ల: ఎంపీడీఓ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని డీఎస్పీ సంపత్‌రావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించేలా కృషిచేయాలని, నామినేషన్ సమయంలో అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అనిత, ఎంపీఓ సురేష్ ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: తెలంగాణ ప్రజా ఫ్రంట్ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాకేంద్రంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ ముఖ్యఅతిథిగా హాజరై పతాకావిష్కరణ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పాలకుల మెడలు వంచి విజయం సాధించినట్లు కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకుల పార్వతి, లలిత, మినుగు నగేష్, ప్రభాకర్, కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
టేకుమట్ల: మండలకేంద్రంలోని 108 అంబులెన్స్‌ను గురువారం జిల్లా అధికారి రాజునాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, మందుల స్టాక్‌తో పాటు, వాహన కండీషన్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర సేవల కోసం మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. సీజనల్ వ్యాధులు, అత్యవసర సేవల కోసం వచ్చే కాల్స్‌కు సకాలంలో స్పందించి అందుబాటులో ఉన్న ఆస్పత్రులకు చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ హరిప్రసాద్, పైలట్‌లు సదయ్య, షరిపొద్దీన్, రవీందర్ ఉన్నారు.
రేగొండ: కొత్తపల్లిగోరి మండల కేంద్రాలలోని ఎంపీడీఓ కార్యాలయంలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావుతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ సమయంలో ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లిగోరి తహసీల్దార్ లక్ష్మీరాజయ్య, ఎంపీడీఓలు వెంకటేశ్వరరావు, రాంప్రసాద్, మండల ప్రత్యేక అధికారి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

లక్షపత్రి పూజలకు బుకింగ్ ప్రారంభం

లక్షపత్రి పూజలకు బుకింగ్ ప్రారంభం

లక్షపత్రి పూజలకు బుకింగ్ ప్రారంభం

లక్షపత్రి పూజలకు బుకింగ్ ప్రారంభం