
పొగాకు వాడకం ప్రమాదం
ములుగు: పొగాకు తాగిన వారితో పాటు పక్కన ఉండి పీల్చేవారికి అంతే ప్రమాదమని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి బస్టాండ్ వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో యువత పొగాకు వాడకాన్ని విడిచిపెట్టేలా 60రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దన్నారు. పొగాకులోని నికోటిన్ పదార్ధం దూమపానానికి బానిసలుగా మారుస్తుందని తెలిపారు. పొగాకు తాగడం వల్ల ఊపిరితిత్తులు, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతిఒక్కరూ పొగాకుకు దూరంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు పవన్‌కుమార్, ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్, చంద్రకాంత్, డీపీఎంఓ సాంబయ్య, సీహెచ్‌ఓ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు