
ఇసుక క్వారీ తనిఖీ
మల్హర్: మండలంలోని మల్లారంలో నిర్వహిస్తున్న ఇసుక క్వారీ కేంద్రాన్ని పెద్దపల్లి టీజీఎండీసీ పీఓ రాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇసుక లోడింగ్, వేబ్రిడ్జి, వేబిల్లులను పరిశీలించారు. క్వారీ టార్గెట్ ఇప్పటి వరకు పంపిన ఇసుక వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వేబ్రిడ్జి వద్ద లారీలు ఎక్కువ సమయం ఉండకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. లారీల సీరియల్ ప్రకారమే లోడింగ్ జరిగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకులకు, టీజీఎండీసీ సిబ్బందిదేనని ఆయన వెల్లడించారు.