
అదనపు ఉపాధ్యాయుడిని ఇస్తాం..
గణపురం మండలం బుర్రకాయల గూడెం పాఠశాలకు విద్యార్థుల సంఖ్యకు అణగుణంగా మరో ఉపాధ్యాయుడిని నియమిస్తామని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం బుర్రకాయల గూడెం అంగన్‌వాడీకేంద్రాన్ని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమిబసుతో సందర్శించిన క్రమంలో గ్రామస్తులు తమ పాఠశాలలో ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నాడని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థులు ఉన్నారని.. గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య తగ్గిందని కలెక్టర్ అన్నారు. త్వరలో మరో ఉపాధ్యాయుడిని నియమించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.